హిట్ దర్శకుడితో సినిమా మొదలెట్టిన చైతు

Actor Naga Chaitanya Teamup With Anu Emmanuel For His Next, Akkineni Naga Chaitanya Next Film With Anu Emmanuel, Director Maruthi Upcoming Film With Chay Akkineni, It Is Anu Emmanuel In Chay Next, Latest Tollywood News, Telugu Filmnagar, Tollywood Latest Film News, Tollywood Latest News, Tollywood News In Telugu, Tollywood News Today, మారుతీ, హిట్ దర్శకుడితో సినిమా మొదలెట్టిన చైతు
హిట్ దర్శకుడితో సినిమా మొదలెట్టిన చైతు

డైరెక్టర్ మారుతీ వరుస విజయలతో దూసుకెళ్తూ, స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ తనకంటూ కొన్ని పేజీలను రాసుకుంటున్నాడు. భలే భలే మొగాడివో సినిమాతో తనలో కూడా క్లీన్ ఎంటర్ టైనర్ తీసే దర్శకుడు ఉన్నాడని, తాజాగా శర్వానంద్ తో తీసిన మహానుభావుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని తీయనున్నట్లు ఇవాళే అధికారికంగా ప్రకటించేశారు. ఇందులో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రేమమ్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఈ ప్రాజెక్టుకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదేక్రమంలో వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

మరోవైపు చైతు, చందు మొండేటి దర్శకత్వంలో సవ్య సాచి అనే డిఫెరెంట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై త్వరలోనే మొదలెట్టనున్నాడు. అంతేకాకుండా నిన్ననే సమంతను తన జీవిత భాగస్వామిగా స్వీకరించి వివాహమాడిన సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here