వీడెవడు మూవీ రివ్యూ

Latest Telugu Movie News, Latest Telugu Movie Reviews, Telugu Film News 2017, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Veedevadu Movie Live Updates, Veedevadu Movie Public Talk, Veedevadu Movie Review, Veedevadu Movie Story, Veedevadu Review, Veedevadu Review Rating, Veedevadu Telugu Movie Public Response, Veedevadu Telugu Movie Review, వీడెవడు మూవీ రివ్యూ
వీడెవడు మూవీ రివ్యూ

సినిమా : వేడేవడు
నటీనటులు : సచిన్ జోషి, ఈషా గుప్తా
దర్శకత్వం : తాతినేని సత్య
సంగీతం : థమన్ S
నిర్మాత : రైనా జోషి

కథ :
సత్య (సచిన్ జోషి) తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఫస్ట్ నైట్ రోజే హతమార్చాడనే అభియోగంతో జైలుకు వెళ్తాడు. ఈ కేసును హ్యాండిల్ చేయమని ప్రకాష్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కి డిపార్ట్మెంట్ బాధ్యతలు అప్పగిస్తుంది. ఇలా విచారణలో ఉండగా ఈ హత్యకు సత్యకు ఏమాత్రం సంబందం లేదని నిర్ణయానికి వస్తాడు. ఈ హత్య వెనుక చాలా పెద్ద స్థాయిలో కుట్ర జరిగిందని దానిని చేధించాలని నడుం బిగిస్తాడు. మరి ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు ? ఈషా గుప్తానే సత్య భార్యా ? అసలు ఈమె హత్య వెనుక కారణాలు ఏమిటి ? సత్య నే పోలీసులని మాయ చేశాడా ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే !!

విశ్లేషణ :
దర్శకుడు తాతినేని సత్య స్వయానా రైటర్ కాబట్టి ఆద్యంతం థ్రిల్లర్ సినిమాను గ్రిప్పింగ్ గా తెరకెక్కించడంలో సఫలమయ్యారు. కథను నడిపిన తీరు మెచ్చుకోదగ్గదే. అలాగే పోలీసులకు, సత్యకు మధ్య వచ్చే విచారణ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఓ హత్య గురించి ప్రేక్షకుడిని సీరియస్ మోడ్ లోకి నడిపించడం, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకుందామనే ఆతృతను కలిగించడంలో దర్శకుడు సఫలమయ్యారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బ్రిలియంట్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ మొదలయ్యే పాటికి పోలీసులు చేస్తే ఇన్వెస్టిగేషన్ ఇంకా వేగం పుంజుకోవడంతో ట్విస్ట్స్ ఎక్కువగా వస్తుండం, మరోవైపు సత్య హత్యలు ఇలా అన్ని కలిపి బెస్ట్ థ్రిల్లర్ సినిమాగా అనిపించేలా ఉన్నాయి.

నటీనటుల పనితీరు :
సచిన్ జోషి తన పాత్రకు చాలా వరకు న్యాయం చేసిన, ఎమోషన్ సీన్స్ మరియు రూడ్ సీన్స్ లో ఇంకాస్త మెచూర్డ్ యాక్టింగ్ కనబర్చి ఉంటె ఇంకాస్తా బాగుండేది. ఈషా గుప్తా కేవలం పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యింది. పోలీస్ పాత్రల్లో నటించిన కిషోర్, హర్ష వర్ధన్ ల నటన చాలా సహజంగా ఉంది.

సాంకేతిక విభాగం :
మొదటగా చెప్పుకోవాల్సింది థమన్ అందించిన సంగీతం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే చాలా సీన్స్ ను చాలా పవర్ ఫుల్ గా లేపాడు. ఇక బీనేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక దర్శకుడు తాతినేని సత్య రాసుకున్న కథ బాగానే ఉన్నా, సస్పెన్స్ జోనర్ సినిమాకి ఉండాల్సిన స్క్రీన్ ప్లే సరిగాలేకపోవడం కాస్తా నిరుత్సహపరుస్తుంది.

చివరగా :
వీడెవడు సినిమాలో చిక్కు ముడులను చాలా తెలివిగా ట్విస్ట్ రూపంలో వేశారు. కానీ వాటిని అదే రీతిలో విప్పడంలో కాస్త తడపడినా బెస్ట్ థ్రిల్లర్ సినిమాగా అయితే నిలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here