మేనేజర్ అరెస్ట్ పట్ల తన వాదనను వినిపించిన కాజల్ అగర్వాల్

Celebrities Latest News, Kajal about Drugs in Tollywood, Kajal About her Manager Ronnie Arrest, Kajal Agrwal Latest News, Kajal Latest Movie News, Kajal Manger Ronnie Arrest Matter, Tollywood Drugs List, Tollywood Drugs Scandal Latest News, Tollywood Latest News

కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్ట్ కావడంతో సినీపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై కాజల్ ఎలా రియాక్ట్ అవుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే క్రమం ఈ స్టార్ హీరోయిన్ తన వంతు బాధ్యతగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన వివరణను తెలిపారు.

ఇందులో ” ‘రోనీ విషయం తెలిసి షాక్ అయ్యాను. సమాజానికి హానికరమైన ఇలాంటి విషయాలను నేను ఎప్పుడు సప్పోర్ట్ చేయను. ఇది ఎందుకు చెప్తున్నానంటే… నాకోసం పనిచేసే వాళ్ళ పట్ల నేను జాగ్రత్త వహిస్తాను…తప్పా వాళ్ళ వ్యక్తి గత జీవితాలలోకి అసలు వెళ్ళాను. ఒక్కసారి వృత్తి పరమైన పనులు ముగిశాక వాళ్ళ పర్సనల్ వ్యవహారాలను పట్టించుకోను” అని తెలిపారు.

ఇక పోతే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తమిళంలో అజిత్ సరసన నటించిన వివేగం (తెలుగులో వివేకం) సినిమా ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here