పూర్ణ “రాక్షసి” సినిమా రివ్యూ

పూర్ణ రాక్షసి సినిమా రివ్యూ,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates,Latest Telugu Movie Reviews,poorna rakshasi telugu movie review,rakshasi Movie Review,rakshasi Movie Story,rakshasi Movie Review Rating,rakshasi Movie Updates
Rakshasi Telugu Movie Review Rating Talk

రాక్షసి సినిమా రివ్యూ :

సినిమా : రాక్షసి
నటీనటులు : పూర్ణ, అభిమన్యు సింగ్, ప్రభాస్ శ్రీను, గీతాంజలీ.
దర్శకత్వం : పన్నా రాయల్
నిర్మాత : అశోక్ మందా
బ్యానర్ : డ్రీం క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్స్

పూర్ణ, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ డ్రామా “రాక్షసి” సినిమా ఈ రోజే ప్రేక్షకుల వద్దకు వచ్చింది. మరి ఈ రాక్షసి ఏ మేరకు మెప్పించిందో చూసేద్దామా !!

కథ :

ఈ సినిమా కథాపరంగా చూస్తే పూర్ణ తన భర్త, ఇద్దరి పిల్లతో కలిసి ఓ కొత్త ఇంట్లో అద్దెకు దిగుతారు. అలా కాలం గడిచే కొద్దీ.. ఆ ఇంట్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇదే క్రమంలో పిల్లకు మాత్రమే వికృత రూపాలు కనిపిస్తుంటాయి. ఆ విషయం పూర్ణకు చెప్పగా…చిన్నపిల్లలు కదా ఎదో పిచ్చి పిచ్చి కలలు అనుకుని పెడచెవిన పెడుతుంది. వాటి తీవ్రత ఎక్కువై చివరికి పూర్ణకు కూడా ఆ వికృత రూపాలు కనిపించి, మీ అందర్నీ మట్టుపెడతామని హెచ్చరిస్తాయి. ఇక ఆ సందర్బం నుండి తన పిల్లలను, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది ? దానికి ఆమె అందుకోసం ఎలాంటి సాహసాలు చేసింది. అసలు ఆ ఆత్మ ఎవరు? వీరికె ఎందుకు కనిపిస్తోంది అని తెలియాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే పూర్ణ అనే చెప్పాలి. ఈమెకు అవును లాంటి థ్రిల్లర్ సినిమాలో నటించింది కాబట్టి ఇలాంటి రోల్ ను చాలా ఆసక్తికరంగా చేసింది. ఆ దయ్యం వచ్చే సన్నివేశాలను అద్భుతమైన గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించారు. ఇంకా చిన్న పిల్లల సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆ ప్రేతాత్మ కనిపించే సీన్ ను దర్శకుడు పన్నా రాయల్ చాలా బాగా టేకప్ చేశారు. ఇంకా అభిమన్యు సింగ్ ఆ మాంత్రికుడి పాత్రలో ఇంటెన్సీటీతో నటించారు. మధ్యలో మధ్యలో తాగుబోతు రమేష్, ప్రభాస్ శ్రీనులు చేసిన కామెడీ కూడా బాగానే పండి, ప్రేక్షకులకు ఓ మోస్తారు ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్స్ ను ఇంకా ఆసక్తికరంగా మారి క్లైమాక్స్ ను బాగా పండేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ కనబడుతోంది. సినిమాటోగ్రాఫర్ కూడా మంచి ఫ్రేమ్స్ సెట్ చేసుకుని, కెమెరా మోషన్ తోనే చాలా చోట్ల భయాన్ని కలిగించాడు. యాజమాన్య అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. పూర్ణ, పాటల్లో తన డ్యాన్స్, అభినయంతో సినిమాని చాలా వరకు నిలపగలిగింది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ చూస్తే మొదటగా కథే అని చెప్పాలి. తెలుగులో దయ్యం ప్లాట్ తో చాలా సినిమాలే వచ్చాయి. ఇందులో కొత్తగా అనిపించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే..పూర్ణ, చిన్న పిల్లలు సీన్స్. ఇంకా గ్రాఫిక్స్ కూడా ఏదో పెట్టాలని పెట్టారు తప్పా, అవి అంత భయాన్ని కానీ, కొత్తగా ఏమి అనిపించలేదు. స్క్రీన్ ప్లే సరిగా రాసుకుని ఉంటె ఇంకా బాగుండేది. సినిమా సాఫీగా సాగుతున్న టైంలో అనవసరంగా కొత్త కొత్త పాత్రలు వచ్చేసి, ఇష్టమొచ్చినట్టు చేస్తుంటాయి. ప్రేక్షకుడి కొన్ని సన్నివేశాలు చాలా ఇర్రిటేట్ గా అనిపించేలా ఉన్నాయి.

తీర్పు : “రాక్షసి” పేరులో ఉన్నత భయం సినిమాలో అణువణువునా కనిపించింది. హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here