తారక్ వెనుక భారీగా రాజకీయ కుట్ర ??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షంగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటు కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో కొత్తల్లుడిలా అందరిచేత ప్రశంశలు అందుకొని, కొద్దో గొప్పో మంచి పనులు చేసింది. కానీ గడిచిన ఒక సంవత్సరం నుండి ఈ పార్టీ పరిస్థితి చూస్తుంటే గడ్డుకాలం తప్పేలా లేదు. ఇందుకు దారితీసిన పరిస్థితులు ఒక సారి చూసుకుంటే కాల్ మనీ వ్యవహారం, మొన్న చిందరవందరగా చేసిన మంత్రి వర్గ విస్తరణ, రైతు రుణమాఫీ సరిగా అమలు కాకపోవడం కూడా ఒకటి. రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా ఏమాత్రం పొంతన లేని ప్లాన్స్, సిఆర్డిఏ భూసేకరణ చట్టాన్ని కూడా విచ్చలవిడిగా వాడుతుండడం, అసలు రాజధాని నిర్మాణంలో ప్రజలకు ఓ సరైన అవగాహన ఇవ్వకపోవడం వంటివి TDP పార్టీకి వ్యతిరేక పవనాలుగా నిలుస్తున్నాయి. ఇంకో రెండేళ్లలో ఎన్నికలలు కూడా రాబోతున్నాయి. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రసంగాలు కూడా అంతా ఆమోదయోగ్యాంగా కనిపించలేదు. ఇదే విషయాన్ని గమనించిన పార్టీ శ్రేణులు ఈ పరిస్థితిని అధిగమించడానికి ఓ సూపర్ ప్లాన్ తో సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

అందులో భాగంగానే Jr NTR ని రంగంలోకి దించాలని నిర్ణయించారట. అసలే ఎన్టీఆర్ సినిమాల పరంగా, బాక్స్ ఆఫీస్ లెక్కలు పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. గతంలో 2009 ఎన్నికలలో ఎన్టీఆర్ వచ్చి ‘అమ్మల్లారా, అక్కల్లారా’ అని స్పీచ్ లు ఇస్తుంటే జనాలు వెర్రితిపోయిరి. కానీ అప్పట్లో YSR కు అనుకూలంగా పవానాలు వీస్తుండడంతో ప్లాన్ రివర్స్ అయింది. ఎన్టీఆర్, మాటలతోనే మంత్రముగ్దుల్ని చేయడంలో సిద్ధహస్తుడు. స్వర్గీయ నందమూరి తారకరామ రావు గారికి ఉన్న వాక్చాతుర్య లక్షణం అలానే చెక్కు చెదరకుండా అలానే ఎన్టీఆర్ కి వచ్చేసింది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న టీడీపీ శ్రేణులు, హరికృష్ణకు చైర్మన్ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారట.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించి, ఓట్లు చీలకుండా బాగానే అడ్డుకట్ట వేశారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీని 2019 ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా పనులు మొదలెట్టేశాడు. ఆ వైవు జగన్ కూడా సందు దొరికినప్పుడల్లా వాయిస్తూనే ఉన్నాడు. మరి ఈ పరిణామాల మధ్య ఎన్టీఆర్ ప్రచారానికి వస్తాడో, లేదో, మరి ముఖ్యంగా దీనికి బాలయ్య బాబు ఆమోదముద్ర వేస్తాడా అని ప్రశ్నర్థకంగా మారింది. సో వెయిట్ అండ్ సి ఏం జరుగుతుందో !!

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here