రీతూ వర్మకు తమన్నా షాక్ !!

టాలీవుడ్ మూవీ న్యూస్, తమన్నా రీతూ వర్మ, తమన్నా లేటెస్ట్ న్యూస్, తెలుగు ఫిలింనగర్, తెలుగు ఫిల్మ్ న్యూస్, తెలుగు సినిమా న్యూస్, రీతూ వర్మ తదుపరి సినిమా, రీతూ వర్మ లేటెస్ట్ న్యూస్, రీతూ వర్మకు తమన్నా షాక్,పెళ్లి చూపులు
Ritu varma in upset

పెళ్లి చూపులు, గత సంవత్సరం ఓ చిన్న సినిమాగా విడుదలై, మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విజయం సాధించి ఇండస్ట్రీ జనాలని అమాంతం తనవైపు తిప్పుకున్న సినిమా ఇది. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, రీతూ వర్మలకు ఎనలేని క్రేజ్ తోపాటుగా మంచి మంచి ఆఫర్లు ఎగేసుకొచ్చాయి. విజయ్ దేవరకొండ చేసిన ద్వారక సినిమా కాస్త నిరాశపరిచినా, అర్జున్ రెడ్డి కేవలం టీజర్ తోనే అమాంతం హైప్ ని క్రియేట్ చేసుకుంది. మరి కౌశిక్ అలియాస్ ప్రియదర్శి లైఫ్ కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఎంతలా అంటే మహేష్ బాబు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసేంతలా !! వీళ్లంతో పోల్చుకుంటే రీతూ వర్మ కూడా తక్కువేం కాదనిపిస్తోంది.

రీతూ వర్మ కెరియర్ గ్రాఫ్ చూస్తే…గౌతమ్ మీనన్, చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “ధృవ నచ్చితిరమ్” సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇదే కాకుండా ధనుష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా విఐపి సినిమా సీక్వెల్లో సైతం ఓ పాత్రలో నటించింది. ఈ లెక్కన ఈ అమ్మడు తెలుగులో కంటే తమిళంలోనే బాగా ఆఫర్లు కొట్టేస్తోంది. నిఖిల్ ‘కేశవ’ సినిమాలో హీరోయిన్ గా నటించినా అది ఏమాత్రం తెలుగులో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో నటించడానికి ఏమాత్రం సహాయ పడలేదు.

ఇప్పడున్న మేటర్ ఏంటంటే తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ “పెళ్లి చూపులు” సినిమాను అక్కడ రీమేక్ చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. ఇందులో హీరోయిన్ గా తననే తీసుకుంటారు అని రీతూ వర్మ తెగ ముచ్చటపడింది. తీరా చూస్తే సీన్ మారి మిల్క్ బ్యూటీ “తమన్నా” హీరోయిన్ రోల్ ను ఎగరేసుకుపోయిందని సమాచారం. దీనివల్ల మన “చిత్ర” కాస్తా బుంగమూతి పెట్టుకున్నట్లు సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here