“జై” పాత్రలో ఎన్టీఆర్ “రావణుడే”

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పవర్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో NTR Arts బ్యానర్ పై “జై లవకుశ” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి సారి ఎన్టీఆర్ ఈ సినిమాలో త్రిపాత్రిభినయంగా జై, లవ, కుశ పాత్రలను పోషిస్తున్నాడు. ఇందులో నెగటివ్ షేడ్స్ గల “జై” క్యారెక్టర్ టీజర్ ను చిత్రబృందం కొద్దీ సేపటి క్రితమే విడుదల చేసింది. మరీ ఈ పవర్ ఫుల్ టీజర్ పై ఓ లుక్ వేద్దామా !!

టీజర్ ఓపెనింగ్ లోనే సింహాసనంపై ఎన్టీఆర్ కూర్చుని, ఆ చిన్న గొడ్డలితో కర్కశంగా చూస్తుంటాడు. “జై”, రావణుడికి చేతులెత్తి దండం పెట్టి, తనెంత క్రూరుడో చేతులకి సంకెళ్లు వేసుకోవడం వ్యక్తపరచడం లాంటి అంశాలు ఈ పాత్రలో ఉన్న క్రూరత్వాన్ని తెలుపుతున్నాయి. తరువాత ఎన్టీఆర్ ఈ క్రింది డైలాగ్ ను ఎంతో ఇంటెన్సిటీతో నత్తి యాసలో అదరగొట్టాడు.

ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల…ఈ రావణున్ని సంపాలంటే సముద్రమంత ధై…ర్యం ఉండాల !! ఉందా ??

ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ కళ్ళలో ఆ ఇంటెన్సిటీని, యాక్షన్ సీన్స్ లో రావణుడికి ప్రతిబింభంగా ఎన్టీఆర్ ని అద్బుతంగా ప్రోజెక్ట్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సఫలమయ్యాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన “అసుర అసుర” మరియు “జై రావణ” బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ టీజర్ కె హైలెట్. నిర్మాత కళ్యాణ్ రామ్, ఈ సినిమా గ్రాండియర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీగానే నిర్మించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైరెక్టర్ బాబీ అలియాస్ KS రవీంద్ర, NTR ను విలన్ గా ‘జై’ క్యారెక్టర్ లో జీవించేలా చేశాడు.

మొత్తంగా జై లవకుశ, ఎన్టీఆర్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఖచ్చితంగా నిలవనుందని ఈ ‘ జై టీజర్’ బల్లగుద్ది మరీ చెప్తోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here