కాజల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

కాజల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా,టాలీవుడ్ మూవీ న్యూస్,తెలుగు ఫిలింనగర్,తెలుగు ఫిల్మ్ న్యూస్,తెలుగు సినిమా న్యూస్,కాజల్ అగర్వాల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా,కాజల్ అగర్వాల్ లేటెస్ట్ న్యూస్,కాజల్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే అనే సినిమా చేస్తుంది

ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరో హీరోయిన్లు తమ తమ సౌందర్య అందాలను ఇంకా మెరుగుపరుచుకునేందుకు రకరకాల సర్జరీలు చేయించుకుంటారు. కొంతమంది తమలో ఉన్న లోపాలను సరిచేసుకునేందుకు కూడా సర్జరీలను ఆశ్రయిస్తారు. కాగా, స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ కూడా తన ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న వార్తలు వస్తున్నాయి.

కాజల్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో “ఎమ్మెల్యే ” అనే సినిమా చేస్తుంది. ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనేది ట్యాగ్ లైన్. దాదాపుగా 10 సంవత్సరాల తరువాత వీరిద్దరూ జతకట్టడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నిన్న కళ్యాణ్ రామ్ బర్త్ డే ని పురస్కరించుకుని “ఎమ్మెల్యే ” టీమ్ ఆయన బర్త్ డే వేడుకలు షూటింగ్ లోనే సెలబ్రేట్ చేశారు.

కాగా, ఈ వేడుకలో కాజల్ అగర్వాల్ ఇంతకుముందు కంటే మరింత అందంగా కనిపించింది. ఆమె ముఖం లో గమనించదగ్గ వ్యత్యాసం ఉంది. కాగా, ఆమె ఏదైనా సౌందర్య శస్త్రచికిత్స చేయించుకుందా అనే డౌట్ అభిమానులలో రావడంతో.. కాజల్ టీమ్ ఆ వార్తలను కొట్టిపడేసినట్లు చెపుతున్నారు. అయినా ఇండీస్ట్రీలో అడుగుపెట్టి 10 సంవత్సరాలైనప్పటికీ కాజల్ క్రేజ్ ఇంకా రెట్టింపవుతుందంటే ప్రేక్షకులకు అసలు మ్యాటర్ అర్ధమయ్యే ఉంటుందిలే?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here