“కత్తి రెడ్డి” గా బ్రహ్మి

కత్తి రెడ్డి గా బ్రహ్మి,టాలీవుడ్ మూవీ న్యూస్,తెలుగు ఫిలింనగర్,తెలుగు ఫిల్మ్ న్యూస్,తెలుగు సినిమా న్యూస్,బ్రహ్మి అలియాస్ బ్రహ్మానందం,బ్రహ్మానందం లేటెస్ట్ న్యూస్,కత్తి రెడ్డి సినిమా న్యూస్,కత్తి రెడ్డి మూవీ న్యూస్,శభాష్ నాయుడు చిత్రంలో బ్రహ్మి
కత్తి రెడ్డి గా బ్రహ్మి

బ్రహ్మి అలియాస్ బ్రహ్మానందం, ఒకప్పుడు ఈపేరు వింటేనే నవ్వుకునేవాళ్ళం.. ఇంకా ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు వాళ్ళ సీట్లలో కూర్చునేవారు కాదు. మరి అంతటి కామెడీ పండించే బ్రహ్మీకి కొంతకాలంగా ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రేక్షకులు కొత్త కామెడీ కావాలనుకుంటున్నారు కాబోలు, దర్శకనిర్మాతలు కొత్త హాస్యనటులను ఎంపిక చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆయన ఎక్కువ డేట్స్ కేటాయించిన రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఒకటి కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న “శభాష్ నాయుడు” చిత్రంలో బ్రహ్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మరొకటి మంచు విష్ణు హీరోగా “ఆచారి అమెరికా యాత్ర” చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కూడా బ్రహ్మి పాత్ర బాగా గిలిగింతలు పెడుతుందట.

అయితే బ్రహ్మి తన పూర్వ వైభవం పొందాలంటే ఈ రెండు సినిమాల హిట్స్ తప్పనిసరి. కాగా, ఆయన ప్రధాన పాత్రదారిగా ఇంకో సినిమా రూపొందుతుంది. అదే “కత్తి రెడ్డి” .. ‘ఎత్తిదే దించడు’ అనేది క్యాప్షన్. ఈ సినిమాలో టైటిల్ రోల్ లో బ్రహ్మానందం కనిపించనున్నాడు. రవి వర్మ దర్శకత్వం వహిస్తుండగా ‘జబర్దస్త్’ ఫేమ్ రచ్చ రవి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో బ్రహ్మి లీడ్ రోల్ గా చేసిన సినిమాలు బాగానే క్రేజ్ ను సంపాదించాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here