తాప్సి “ఆనందో బ్రహ్మ” రిలీజ్ డేట్

తాప్సి ఆనందో బ్రహ్మ రిలీజ్ డేట్,టాలీవుడ్ మూవీ న్యూస్,తెలుగు ఫిలింనగర్,తెలుగు ఫిల్మ్ న్యూస్,తెలుగు సినిమా న్యూస్,ఆనందో బ్రహ్మ మూవీ రిలీజ్ డేట్,ఆనందో బ్రహ్మ తెలుగు మూవీ రిలీజ్ డేట్,ఆనందో బ్రహ్మ మూవీ లేటెస్ట్ న్యూస్,హర్రర్ కామెడీ సినిమా,హీరో శ్రీనివాస్ రావు,ఆనందో బ్రహ్మ రిలీజ్ డేట్ ను ఆగష్టు 18 అని అధికారికంగా ప్రకటించారు
తాప్సి ఆనందో బ్రహ్మ రిలీజ్ డేట్

తెలుగులో ఇప్పటిదాకా వచ్చిన హర్రర్ కామెడీ సినిమాలన్నీ మనుషులని భయానికి గురిచేస్తూ, ప్రేక్షుకులకు భయానుభుతిని కలిగించిన సినిమాలే తెరమీదకు వచ్చాయి. ఈ రొటీన్ ఫార్మములాకు భిన్నంగా మనుషులే దెయ్యాలని భయపెట్టే కథాంశంతో దర్శకుడు మహి వి రాఘవ్, తాప్సి మరియు శ్రీనివాస్ రావులను హీరో హీరోయిన్లుగా పెట్టి “ఆనందో బ్రహ్మ” సినిమాను కమెర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్, బాహుబలి స్టార్ “ప్రభాస్” చేతుల మీదుగా విదుదలై అటు ప్రేక్షుకుల్లోను ఇటు బిజినెస్ ట్రేడ్ వర్గాల్లోను మంచి క్రేజ్ ను సంపాదించి.

ఇక టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న నేపథ్యంలో చిత్రబృందం వారు సినిమా రిలీజ్ డేట్ ను ‘ఆగష్టు 18’ అని అధికారికంగా ప్రకటించారు. ఈ సంధర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ” తాప్సికి ఈ సినిమా తెలుగులో మంచి కంబ్యాక్ ఫిల్మ్ గా నిలుస్తుంది. అంతేకాకుండా తన వైవిధ్యమైన నటనకూడా అందరిని కట్టిపడేస్తుంది. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ సినిమాని టెక్నిక‌ల్ గా, క‌మ‌ర్షియ‌ల్ గా చాలా బాగా తెరకెక్కించాడు. ఇది ఓ కాన్సెప్ట్ ఫిలిం కావున…ప్రేక్షుకులను ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మెండుగా ఉంటాయి” అని తెలిపారు.

ఈ ఆనందో బ్రహ్మ సినిమాలో తాప్సి పన్ను,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్,”తాగుబోతు”రమేష్,”శకలక”శంకర్,రాజీవ్ కనకాల, పోసాని కృష్ణ మురళి,తనికెళ్ళ భరణి,విద్యులేఖ రామన్,మరియు ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు. ఈ సినిమాని 70MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా & శశి దేవిరెడ్డి నిర్మించగా, మహి వి రాఘవ్ గారు కథ, స్క్రీన్ ప్లే తో పాటు దర్శకత్వం వహించారు. K సంగీతం సమకూర్చారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here