జవాన్ గా అల్లు అర్జున్

జవాన్ గా అల్లు అర్జున్,టాలీవుడ్ మూవీ న్యూస్,తెలుగు ఫిలింనగర్,తెలుగు ఫిల్మ్ న్యూస్,తెలుగు సినిమా న్యూస్,పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా,అల్లు అర్జున్ లేటెస్ట్ న్యూస్,అల్లు అర్జున్ ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్
allu arjun as jawaan

అల్లు అర్జున్, DJ దువ్వాడ జగన్నాథమ్ సినిమా విజయం సాధించడంతో అభిమానులతో ముచ్చటించడానికి టూర్ ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే అమెరికాకు వెళ్లి అక్కడి తెలుగు వారిని కలుస్తూ  సినిమాకు కాస్తా బూస్ట్ ఇస్తున్నాడు. ఇక ఈ టూర్ కంప్లీట్ అయినా తరువాత ఈ వారాంతంలో హైదరాబాద్ చేరుకొని, వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్న “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాకు తన లుక్ ను పూర్తిగా మార్చుకుని ఆగష్టు మొదటి వారంలో కల్లా సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారు.

ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇందులో అల్లు అర్జున్ ఓ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనునున్నారు. తండ్రి పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించనుండగా, శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. గతంలో వక్కంతం వంశీ రచయితగా అల్లు అర్జున్ కు రేసు గుర్రం, రవితేజకు కిక్ ను, ఎన్టీఆర్ కు టెంపర్, రామ్ చరణ్ కు ఎవడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఈ రచయితకు దర్శకుడిగా మొదటి సినిమానే అయినప్పటికీ కథను మలచడంలో తనకో ఫార్ములా ఉంది. ఇక అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారో చిత్రబృందం ఇంకా తెలుపలేదు. లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here