మూడేళ్ళ క్రిందట రావాల్సిన “నిన్ను కోరి”

మూడేళ్ళ క్రిందట రావాల్సిన నిన్ను కోరి,టాలీవుడ్ మూవీ న్యూస్, తెలుగు ఫిలింనగర్, తెలుగు ఫిల్మ్ న్యూస్, తెలుగు సినిమా న్యూస్,నాని తన తాజా చిత్రం నిన్ను కోరి,నిన్ను కోరి మూవీ న్యూస్,నిన్ను కోరి సినిమా న్యూస్
Ninnu kori tor release before three years

నాని తాజా చిత్రంగా “నిన్ను కోరి” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించి .. “నిన్ను కోరి” సినిమా ద్వారా ట్రిపుల్ హ్యాట్రిక్ లోకి అడుగు పెట్టనున్నాడు నాని. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, అండ్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ సారి కూడా నాని హిట్ కొట్టడం ఖాయం అని అందరూ అంటున్నారు.

ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు శివ డైరక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఫస్ట్ సినిమాతోనే ఒక వైవిద్యభరితమైన కథను ఎంచుకుని, నాని ని ఒప్పించి రంగంలోకి దిగిన ఇతను తన ఫస్ట్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. కథను రాయడం ఒక భాగమైతే .. మరి ఆ కథ ను ఒప్పించగలగడం ఒక ఎత్తు .. ఒప్పించిన కథ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం ఒక మరో ఎత్తు. అలా ఎప్పుడో మూడేళ్ళ క్రిందట ఈ డైరక్టర్ నాని కి “నిన్ను కోరి” కథ చెప్పాడట. కథ బాగా నచ్చడంతో, నాని ఈ కథను వేరే హీరో దగ్గరకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడ్డాడట. అప్పటికే “పైసా”, “ఆహా కళ్యాణం” వంటి చిత్రాలు నిరాశపరచడంతో, సరైన ప్రొడ్యూసర్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు డివివి అండ్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. అలా మూడేళ్ళ క్రిందట రావాల్సిన “నిన్ను కోరి” జులై 7న థియేటర్స్ వద్దకు రావడానికి సిద్ధంగా ఉంది. కాగా, నాని టేస్ట్ ను బాగా గుర్తించిన ప్రేక్షకులు ఈ సినిమాకు ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here